పూర్తికావచ్చిన మూసారాంబాగ్ బ్రిడ్జి
రాకపోకలకు సిద్ధంగా వంతెన
తొలగనున్న ప్రయాణికులు, వాహనదారుల ఇబ్బందులు
ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
ముషీరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): మూడు సంవత్సరాల క్రితం గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన మూసారాంబాగ్ బ్రిడ్జి పనులు ఎట్టకేలకు పూర్తి కావచ్చాయి. ఒకవైపు నిర్మాణం పనులు పూర్తి అవుతున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభోత్సవం చేయడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రతి స ంవత్సరం వానాకాలంలో మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద వరద జోరుగా రావడంతో బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయి రాకపోకలకు ప్రజల కు ఇబ్బంది కలుగుతుంది. అంబర్ పేట ముసా రాంబాగ్ కు రాకపోకలు నిలిచిపోయేవి. అంబర్ పేట నుంచి ముసారాంబా గ్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట కు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు.
దీంతో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఇక్కడ కొత్తగా హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా రూ.52 కోట్ల నిధులు విడుదల చేశారు. 2023లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. 2024లో పనులు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు నత్త నడకన సాగాయి. ఈ విషయంలో ఎమ్మెల్యే పలుమార్లు సీఎం. మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో కూడా లేవనెత్తారు.
పలుమార్లు పనులను సమీక్షించారు. పనుల్లో వేగం పెంచడంతో చివరి దశకు పనులు పూర్తికా వచ్చాయి. ప్రస్తుతం పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. త్వరలో ఈ పనులను పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఒకవైపు పనులు పూర్తయితే రాకపోకలకు అనుమతిస్తారు. రెండు వైపు బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయ్యే పరకు ప్రస్తుత బ్రిడ్జి సుంచే ఇరువైపులకు రాకపోకలకు అనుమతిస్తారు. ఈ బ్రిడ్జిని ప్రారంభోత్సవం జరిగితే ఇక్కడి ప్రజలకు ఇబ్బందులు తొలగిపోతాయి. త్వరలో బ్రిడ్జి ప్రారంభం కానునడంతో అంబర్ పేట ప్రజలు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






