calender_icon.png 16 July, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాక్ స్వాతంత్య్రం దుర్వినియోగమవుతోంది

15-07-2025 12:00:00 AM

  1. మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై కార్టూనిస్ట్ హేమంత్ అభ్యంతరం
  2. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు  

న్యూఢిల్లీ, జూలై 14: అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని కార్టూనిస్ట్ హేమంత్ మాలవీయ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ను సోమవారం సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. కొంత మంది కళాకారులు, కా ర్టూనిస్టులు, స్టాండప్ కమెడియన్లు భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ అర వింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఆగ్ర హం వ్యక్తం చేసింది.

ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై వేసిన కార్టూన్ అభ్యంతరకరంగా ఉండటంతో కార్టూనిస్ట్ హేమంత్ మాలవీయపై గతంలో కేసు నమోదయింది. అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ మాలవీయ వేసిన పిటిషన్‌పై సుప్రీం విచారణ జరిపింది.

‘అసలు మీరు ఇటువంటి ఎందు కు చేస్తున్నారు’? అని హేమంత్ మాలవీయను ప్రశ్నించింది. ఈ కేసులో తీర్పు వచ్చే వరకు పిటిషనర్‌కు మధ్యంతర రక్షణ కల్పించాలని గ్రోవర్ ధర్మాసనాన్ని కోరగా.. మం గళవారం ఈ విషయం చూస్తామని ధర్మాసనం పేర్కొంది. 

ఫోన్ రికార్డింగ్‌లు సాక్ష్యాలే.. 

భార్యాభర్తల విడాకుల కేసుల్లో భాగస్వామి ఫోన్ సీక్రెట్ రికార్డింగ్‌లను కూడా సాక్ష్యాలుగా పరిగణించొచ్చని సుప్రీం వెల్లడించింది. ఆ జంట వివాహ బంధం బలం గా లేదనే విషయాన్ని రికార్డింగ్స్ స్పష్టం చేస్తాయని సుప్రీం అభిప్రాయపడింది. పం జాబ్‌కు చెందిన జంట విడాకుల కేసులో జస్టిస్ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.