calender_icon.png 16 July, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శుభాంశు బృందం తిరుగుపయనం

15-07-2025 12:00:00 AM

  1. ఐఎస్‌ఎస్ నుంచి ‘డ్రాగన్’ వ్యోమనౌక అన్‌డాకింగ్ విజయవంతం
  2. నేడు మధ్యాహ్నం 3 గంటలకు కాలిఫోర్నియా సముద్ర జలాల్లో దిగనున్న వ్యోమనౌక
  3. వారం రోజుల పాటు క్వారంటైన్‌కు వ్యోమగాములు

న్యూఢిల్లీ, జూలై 14: యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)  నుంచి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యో మగాములు మరికొన్ని గంటల్లో భూమి మీదకు రానున్నారు. ఐఎస్‌ఎస్ నుంచి శు భాంశు బృందాన్ని తీసుకువస్తున్న ‘డ్రాగన్’ వ్యోమనౌక అన్‌డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది. భారత కాలమాన ప్రకారం సా యంత్రం 4.35 గంటల సమయంలో డ్రాగ న్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రంతో విడిపోయింది.

అనంతరం వ్యోమనౌక దాదాపు 22 గంటల పాటు ప్రయాణించి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అమెరికాలోని కా లిఫోర్నియా తీరానికి సమీపంలో సముద్ర జలాల్లో దిగుతుంది. అనంతరం శుభాంశు బృందాన్ని అక్కడి నుంచి క్వారంటైన్‌కు తరలిస్తారు. దాదాపు వారం రోజుల పాటు వ్యో మగాములు క్వారంటైన్‌లో ఉంటారు.

యాక్సియం-4 మిషన్‌లో శుభాంశు బృందం గత నెల 25న నింగిలోకి దూసుకెళ్లింది. వీరి బృందం దాదాపు 18 రోజుల పాటు 60కి పైగా ప్రయోగాలు చేసింది. విశ్వంలో జీరో గ్రావిటీలో మానవ కండరాలకు కలిగే నష్టం,జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న దానిపై పరిశోధనలు చేశారు.