15-07-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, జూలై 14: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన త్రిపుర హైకోర్టు సీజేగా పని చేస్తున్నారు. సుప్రీం కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదించడంతో కేంద్ర న్యాయశాఖ బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది.
సోమ వారం నలుగురు ప్రధాన న్యాయమూర్తుల బదిలీ చేయడంతో పాటు జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, పట్నా, గుహవాటి హైకో ర్టులకు.. ఐదుగురు జడ్జీలకు పదోన్నతి కల్పి స్తూ కొత్త సీజేలుగా నియమించింది. ప్రస్తు తం జార్ఖండ్ హైకోర్టు సీజేగా పని చేస్తున్న జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రారావు త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.
రాజస్థాన్ హైకోర్టు సీజేగా పనిచేస్తున్న జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాత్సవ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, మద్రాస్ హైకోర్టు సీజేగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ కేఆర్ శ్రీరామ్ రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా బదిలీ అయ్యారు.
కొత్త సీజేలు వీరే..
మధ్య ప్రదేశ్ హైకోర్టు యాక్టింగ్ సీజేగా పని చేస్తున్న సంజీవ్ సచ్‌దేవ అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితుల య్యారు. పట్నా హైకోర్టు యాక్టింగ్ సీజేగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ అశుతోశ్ కుమార్ గుహవాటి హైకోర్టు సీజేగా పనిచేయనున్నారు. ప్రస్తుతం హిమాచల్ హైకో ర్టులో జడ్జీగా విధులు నిర్వర్తించిన జస్టిస్ తర్లోక్ సింగ్ చౌహన్ జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఢిల్లీ హైకోర్టులో జడ్జీగా పని చేస్తున్న జస్టిస్ విభూ భక్రూ కర్ణాటక హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. పట్నా హైకోర్టు జడ్జీగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ విపుల్ మనూభాయి అదే హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఉస్మానియా నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా..
తెలుగువాడైన జస్టిస్ ఎం.ఎస్ రామచంద్రారావు గతంలో హిమాచల్ ప్రదేశ్ హైకో ర్టు సీజేగా విధులు నిర్వర్తించారు. తెలంగాణ, పంజాబ్, హర్యానా హైకోర్టులో జడ్జిగా పని చేశారు. తెలంగాణ హైకోర్టుకు గతంలో యా క్టింగ్ చీఫ్ జస్టిస్‌గానూ రామచంద్రరావు విధులు నిర్వర్తించారు. 1966లో హైదరాబాద్‌లో పుట్టిన రామచంద్రారావు 1989లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకున్నారు. అదే ఏడాది న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో తన పేరు ను నమోదు చేసుకున్నారు. 1991లో యూ నివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి నుంచి ఎఎల్‌ఎం పట్టా అందుకున్నారు.