14 July, 2026 | 11:38 PM

విక్రయానికి స్వచ్ఛమైన గాలి

06-12-2024 02:07 AM

* ప్రత్యేక సరీస్ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఢిల్లీ హోటళ్లు

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించాయి. ఈ నేపథ్యంలో నగరంలోని కొన్ని లగ్జరీ హోటళ్లు స్వచ్ఛమైన గాలిని ప్రత్యేక సర్వీస్ పేరుతో విక్రయిస్తున్నాయి. అమెరికాకు చెందిన బిలియనీర్ బ్రెయాన్ జాన్సన్ తాజా గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్ స్వచ్ఛమైన గాలిని  సర్వీస్ పేరుతో విక్రయిస్తోందంటూ పేర్కొన్నారు. తన రూమ్‌లో ఎయిర్ క్వాలిటీ 2.4 ఉన్నట్టు సైన్ బోర్డు ఫొటో ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా స్మార్ట్ ఎయిర్ ఫిల్టర్లను అమర్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మరో నెటిజన్ కూడా తాజ్ ప్యాలెస్‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.