మోదీ ఒకటేనంటూ ‘ఇండియా’ నిరసన
- * మరోసారి డుమ్మా కొట్టిన తృణమూల్, ఎస్పీ
- * ప్రత్యేక జాకెట్లు ధరించి నిరసన
న్యూఢిల్లీ, డిసెంబర్ 5: అదానీ వ్య వహారంపై చర్చకు పట్టుబడుతూ గు రువారం ఇండియా కూటమి ఎంపీ లు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నిరసన వ్యక్తం చేశారు. ‘మోదీ అదానీ ఏక్ హై.. అదానీ సేఫ్ హై’ అని రాసి ఉన్న ప్రత్యేక జాకెట్లను ధరించి ఈ నిరసనలో పాల్గొన్నారు.
చీలిక నిజమేనా?
ఇండియా కూటమిలో చీలిక వ చ్చిందని ప్రచారం జరుగుతోంది. కూటమిలోని కాంగ్రెస్ అదానీ విషయంలో చేస్తున్న నిరసనలకు తృణ మూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ లు హాజరుకావడం లేదు. తాజాగా గురువారం నిరసనకు కూడా ఈ రెం డు పార్టీలు డుమ్మా కొట్టడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. తృణమూల్ నిరసనకు గైర్హాజ రవడంపై ఆ పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ స్పందిస్తూ.. ‘తృణమూల్ పార్టీ వేరే సమస్యలను హైలెట్ చేద్దామని అనుకుంటోంది. కానీ పార్లమెంట్‌లో మా పక్షాలన్నీ ఐక్యంగానే ఉన్నా యి’ అని తెలిపారు.
తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ లు నిరసనకు రాకపోయినా ఇండి యా కూటమిలోని ఎంపీలతో కాంగ్రె స్ ఎంపీలు అదానీపై చర్చకు నిరసన చేపట్టారు. ‘మోదీ అదానీ ఏక్ హై.. అదానీ సేఫ్ హై’ అని ముద్రించిన జా కెట్లు ధరించి నిరసనలో పాల్గొన్నారు.






