పదివారాలపాటు ఫ్రైడే డ్రై డే
08-06-2024 02:39 AM
వరంగల్ తూర్పు, జూన్ 7: వాన కాలం విషజ్వరాలు వ్యాపించకుండా ఉండటానికి మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు మొదలుపెట్టారు. దోమల నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను మున్సిపల్ బయాలజిస్ట్ మాధవరెడ్డి పర్యవేక్షణలో బల్దియా వ్యాప్తంగా మలేరియా నివారణ విభాగం సిబ్బంది శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూన్ 7 నుంచి ప్రతి శుక్రవారాన్ని డ్రై డే గా పాటించాలని అధికారులు సూచించారు. ప్రజలు సైతం దోమల నివారణ చర్యల్లో సహకరించాలని కోరారు. ప్రతి కుటుంబం దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.






