15 July, 2026 | 6:22 AM

రైతులు కోరిన విత్తనాలు ఇవ్వండి

08-06-2024 02:41 AM

విత్తన డీలర్లకు కలెక్టర్ ఆశీష్ ఆదేశం

నిర్మల్, జూన్ 7 (విజయక్రాంతి) : రైతులు కోరుకొంటున్న విత్తనాలు అందు బాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ విత్తన డీలర్లను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని పలు విత్తనాల దుకా ణాల్లో తనిఖీలు చేపట్టారు.  అరున్, గాయ త్రి, ఆగ్రో ఎజెన్సీ, విత్తన, ఎరువుల షాపుల్లో స్టాక్ రిజిష్టర్‌లను పరిశీలించారు. రేట్ల వివరాలు, ధరల పట్టికపై ఆరా తీశారు.  అంద రికీ కనిపించేలా ధరల పట్టిక అమర్చాలని చెప్పారు. నకిలీ విత్తనాలు, ఎమ్మార్పీకి మిం చి అమ్మకూడదని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్య వసాయ అధికారి అంజీ ప్రసాద్, మరికొందరు అధికారులు ఉన్నారు.