15 July, 2026 | 6:40 AM

నిదురలేచిన ఔషధశాఖ అధికారులు!

08-06-2024 02:37 AM

మహబూబ్‌నగర్, జూన్ 7 (విజయక్రాంతి) : ఔషద శాఖ అధికారులు స్పందిం చిండ్రు. శుక్రవారం విజయక్రాంతి దిన పత్రిక నందు ‘నిద్రమత్తులో ఔషద శాఖ అధికారులు’ అనే కథనం ప్రచురితం అయిన విషయం విధితమే. ఈ మేరకు స్పందించిన అధికారులు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పలు మెడికల్ షాపులలో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు దాదాపు 10 మెడికల్ షాపులలో ఫార్మాసిస్టులు లేరని గుర్తించి వారికి నోటీసులు అందించడంతోపాటు పట్టణంలోని కొత్త చెరువు రోడ్డులో గల ఓ మెడికల్ షాపు గత కొంత కాలంగా రెన్యూవల్ చేసుకోకుండగానే నడిపిస్తున్న విషయాన్ని గమనించిన ఔషద శాఖ ఏడీ దినిష్, డ్రగ్‌ఇన్స్‌ఫెక్టర్ తోపాటు సంబందింత అధికారులతో కలసి ఆ షాపును సీజ్ చేసిండ్రు. నిబంధనలను అతిక్రమించి మెడికల్ షాపులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీ దినిష్ హెచ్చరించారు.

నిరంతర పర్యవేక్షణ అవసరం

ప్రజల ఆరోగ్యం ఎల్లప్పుడు పదిలంగా ఉండడంతో ప్రముఖ పాత్ర వహిస్తున్న మెడికల్ షాపులలోని మందులు ప్రజలకు అందించడంతో నిబంధనలు అమలు చేయడం జరుగుతుందా ? లేదా ? అని నిరంతరం పర్యవేక్షణ చేసేందుకు ఔషద తనిఖీ శాఖ ఏర్పాటు చేసి సంబంధింత అధికారులను భాద్యతలను అప్పగించడం జరిగింది. కాగా అధికారులు మాత్రం చాలా వరకు చూసి చూడనట్టు వ్యవహరించడం జరుగుతుంది. కేవలం ఒక్క రోజు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోనే తనిఖీ చేస్తే ఒక మెడికల్ షాప్ సీజ్‌తోపాటు దాదాపు 10 మెడికల్‌షాపుల నిర్వహణలో ఫార్మాసిస్టులు లేరని గుర్తింస్తే జిల్లా వ్యాప్తంగా నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఔషద శాఖ అధికారులు కేవలం ఎప్పుడో ఒక మారు కాకుండ నిరంతర పర్యవేక్షణ చేస్తు ముందుకు సాగితే ప్రజల కలకలం మరింత ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. తనిఖీ చేసేందుకు ఏర్పాటు చేసిన అధికారులు తనిఖీలు చేసి ప్రజలకు మంచి మందులు సరియైన విధానంలో అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని ప్రజలు కొరుతున్నారు.