అసెంబ్లీ నుంచి వీధిపోరుకు
ఎర్రవల్లిలో ఉద్రిక్తత.. స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళన
వెయ్యి డప్పులతో కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి యత్నం.. ఫాంహౌస్‌కు వెళ్లకుండా హకీంపేట
వద్ద కేటీఆర్, హరీశ్‌రావు అరెస్టు.. పటాన్చెరులో హోరాహోరీగా నిరసనలు
బోయినపల్లి పీఎస్ వద్ద రాళ్లు, కుర్చీలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల పరస్పర దాడులు
* రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు(Assembly Monsoon Session) మొదలైనరోజే భగ్గుమన్న రాజకీయ మంటలు మరింత ఎక్కువయ్యాయి. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్(Legislative Assembly Speaker Gaddam Prasad Kumar)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధు(Tata Madhu), పోలీసులపై చేయి చేసుకున్న మరో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిని సస్పెండ్ చేసేందుకు అధికార కాంగ్రెస్(Ruling Congress) పట్టుబట్టగా, అసెంబ్లీ ఎదుట పోలీసులు తమ పార్టీ మహిళా శాసనసభ్యులపై దురుసుగా ప్రవర్తించారంటూ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
మంగళవారం అసెంబ్లీలో మాటల తూటాలు పేలుతుండగానే.. మరోవైపు బీఆర్ఎస్ అధినేత నివాసం(BRS chief residence) ఉంటున్న ఎర్రవల్లి ఫామ్‌హౌస్(Erravalli Farmhouse) వద్దకు వేలాదిగా కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. అక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తులు(BRS party workers) కూడా చేరుకోవడంతో కొన్నిగంటల పాటు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎర్రవల్లి, దామరకుంట, వరదరాజపూర్ పరిసరాలు మంగళవారం రాజకీయ రణరంగంగా మారాయి. కాంగ్రెస్ ఎస్సీ విభాగం, దళిత సంఘాల నేతలు కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద డప్పులతో నిరసన చేపట్టాలని నిర్ణయించాయి.
కాంగ్రెస్ కార్యకర్త లు వరదరాజపూర్లోకి రావడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు వినూత్నం గా స్పందించాయి. కాంగ్రెస్ నాయకుల రాకతో గ్రామం అపవిత్రమైందం టూ రోడ్డుపై పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడి యత్నం చేస్తున్నారని తెలుసుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి నేరుగా ఎర్రవల్లి వైపు బయలుదేరారు. అయితే హకీంపేట్ వద్ద పోలీసులు వారి వాహనాలను అడ్డుకున్నారు.
అనంతరం వారు కాలినడకన ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరీశ్‌రావును జవహర్‌నగర్ స్టేషన్‌కు, కేటీఆర్‌ను బోయిన్పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో హకీంపేట, బొల్లారం ప్రాంతాల్లో పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నిరసనకారులు ఎదురెదురుగా రావడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. బోయిన్పల్లి స్టేషన్ ఆవరణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నాయి. స్టేషన్ ఎదుటే కుర్చీలు, రాళ్లతో కార్యకర్తలు కొట్టుకున్నారు.
- ఎర్రవల్లిలో పోలీసులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట.. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి గాయాలు
- దామరకుంటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఘర్షణ
- రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్.. ప్రతిగా కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
- రాళ్లు, చెప్పులతో ఇరువర్గాల దాడులు, పోలీసుల లాఠీచార్జ్
- ఫాంహౌస్‌కు వెళ్లకుండా హకీంపేట వద్ద కేటీఆర్, హరీశ్‌రావు అరెస్టు
గజ్వేల్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా(Siddipet District) గజ్వేల్ నియోజకవర్గం(Gajwel constituency)లోని మర్కుక్ మండలం ఎర్రవల్లి(Erravalli), దామరకుంట, వరదరాజపూర్ పరిసరాలు మంగళవారం రాజకీయ రణరంగంగా మారాయి. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు(Tata Madhu), నవీన్‌కుమార్‌రెడ్డి(Naveen Kumar Reddy) చేసిన వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Former Chief Minister and BRS chief KCR) ఎర్రవల్లి ఫామ్‌హౌస్ ముట్టడికి పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ ఎస్సీ విభాగం, దళిత సంఘాల నేతలు కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద డప్పులతో నిరసన చేపట్టాలని నిర్ణయించాయి.
వెయ్యి డప్పులతో ఫామ్‌హౌస్ వైపు కదులుతామని ప్రకటించడంతో పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. ఫామ్‌హౌస్ పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించి, ప్రధాన రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిరసనకారులు ఫామ్‌హౌస్ వైపు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఘర్షణలను నియంత్రించే క్రమంలో స్వల్ప లాఠీచార్జి చేశారు. ఎర్రవల్లి పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.
బీఆర్ఎస్ శ్రేణుల నిరసనకు అడ్డుకట్ట
కాంగ్రెస్ ముట్టడి పిలుపు నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా ఎర్రవల్లిలో పార్టీ శ్రేణులను సమీకరించేందుకు ప్రయత్నించింది. ఉదయం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమావేశమై నిరసనకు సిద్ధమవుతుండగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా వారిని చెదరగొట్టారు. గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాల నుంచి వచ్చిన వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాదాసు శ్రీనివాస్, రాధాకృష్ణ శర్మ, ఇతర నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి మర్కుక్, గౌరారం, బేగంపేట తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు.
దామరకుంటలో మొదలైన ఘర్షణ
కేసీఆర్ ఫాంహౌస్ వైపు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కదులుతున్న సమయంలో మర్కుక్ మండలం దామరకుంట వద్ద ఉద్రిక్తత మొదలైంది. కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌ను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకుల వాహనాలపై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దీంతో దామరకుంట పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
మరోవైపు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎర్రవల్లి వైపు కదలగా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాటలో నర్సారెడ్డికి గాయాలయ్యాయి. ఆయనను ప్రజ్ఞాపూర్ ఆస్ప్ర తికి తరలించి చికిత్స అందించారు.
వరదరాజపూర్లో దిష్టిబొమ్మలు..
ఎర్రవల్లి సమీపంలోని వరదరాజపూర్లోనూ ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలంగాణ మాదిగల మాల సంఘాల జేఏసీ చైర్మన్ దేవు ని సతీష్ ఆధ్వర్యంలో వెయ్యి డప్పులతో ఫాం హౌస్‌ను ముట్టడించేందుకు తరలిరాగా పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేయగా, దీనికి ప్రతిగా కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరస్పరం రాళ్లు, చెప్పులు రువ్వుకున్నారు. వారిని పోలీసులు చెదరగొట్టారు.
పసుపునీళ్లతో రోడ్డు శుద్ధి
కాంగ్రెస్ కార్యకర్తలు వరదరాజపూర్లోకి రావడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు వినూత్నంగా స్పందించాయి. కాంగ్రెస్ నాయకుల రాకతో గ్రామం అపవిత్రమైందంటూ రోడ్డుపై పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు.
బీఆర్ఎస్ అగ్రనేతల ఎర్రవల్లి బాట
కాంగ్రెస్ శ్రేణులు ఫాంహౌస్ వైపు వస్తుండడంతో బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా అప్రమత్తమయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి నేరుగా ఎర్రవల్లి వైపు బయలుదేరారు. అయితే హకీంపేట్ వద్ద పోలీసులు వారి వాహనాలను అడ్డుకున్నారు. అనంతరం వారు కాలినడకన ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో హకీంపేట, బొల్లారం ప్రాంతాల్లో పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.