24 May, 2026 | 3:24 AM

వాహనదారులపై ఇంధన పిడుగు

24-05-2026 01:15 AM

మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్‌పై లీటర్‌కు ౮౭ పైసలు, డీజిల్‌పై ౯౧ పైసల చొప్పున వడ్డన

గడిచిన ౯ రోజుల్లో సుమారు రూ.౪.౫౦కుపైగా ధరల పెంపు 

హైదరాబాద్‌లో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.112.81, డీజిల్ ధర రూ.100.94

డీజిల్ అమ్మకాల చరిత్రలో తొలిసారి వంద మార్క్ చేరిక

న్యూఢిల్లీ, మే 2౩: వాహనదారులపై మరోసారి ఇంధన పిడుగు పడింది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆయిల్ కంపెనీలు శనివారం మూడోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై ౮౭ పైసలు, డీజిల్‌పై ౯౧ పైసల చొప్పున ధరలు పెంచేశాయి. పశ్చిమాసియా సంక్షోభం, ఉద్రిక్తతలు, హోర్ముజ్ జల సంధి మూసివేత ప్రభావంతో అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం నెలకొంది. భారత్ తన ముడిచమురు అవసరాల కోసం దాదా పు 90 శాతం ఇతర దేశాల పైనే ఆధారపడుతున్నది.

దీంతో అంతర్జాతీయ మార్కెట్లో వచ్చే మార్పులు దేశీయ ఇంధన ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఒక బ్యారెల్‌కు ౧౧౦ డాలర్లకు పైగా పలుకుతున్నది. దీంతో ఆయిల్ కంపెనీలు వాహనదారులపై భారం మోపకుండా నష్టాలు భరించి ఇంధనం సమకూర్చాయి. దీంతో ఆయా కంపెనీలకు ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్రం ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగానే కంపెనీలు ఈనెల 15న మొదటిసారి పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.౩ చొప్పున ధర పెంచాయి.

తర్వాత నాలుగు రోజులకు అంటే.. 19న రెండోసారి ధరలు పెంచాయి. దీంతో లీటర్ పెట్రోల్‌పై ౮౭ పైసలు, డీజిల్ ౯౧ పైసల చొప్పున ధరలు పెరిగాయి. తాజాగా మూడోసారి కూడా లీటర్ పెట్రోల్‌పై ౮౭ పైసలు, డీజిల్ ౯౧ పైసల చొప్పున పెరిగాయి. గడిచిన ౯ రోజుల్లో మొత్తంగా వాహనదారులపై లీటర్ పెట్రోల్‌పై రూ.౪.౭౪, లీటర్ డీజిల్‌పై రూ. ౪.౮౨ చొప్పున భారం పడింది.

మొత్తంగా ఈ ఒక్క నెలలోనే వాహనదారులపై లీటర్‌కు సుమారు రూ.౪.౫౦ పైగా భారం పడింది. పెరిగిన ఇంధన ధరల కారణంగా ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ రూ. 112.81, డీజిల్ ధర లీటర్ రూ.వంద మార్క్ దాటి రూ.100.94కు చేరుకున్నది. భారత ఇంధన విక్రయాల చరిత్రలో తొలిసారిగా డీజిల్ వంద మార్క్‌ను దాటడం గమనార్హం

హైదరాబాద్‌లో స్థిరంగా సీఎన్జీ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు సీఎన్జీ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ నెల 15న మొదటిసారి కిలో సీఎన్జీ ధర రూ.2 పెరిగింది. ౧౯న కిలోకు మరో రూపాయి పెరిగింది. తాజాగా మూడోసారి మరో రూపాయి పెరిగింది. న్యూఢిల్లీలో కిలో సీఎన్జీ ధర మొదటిసారి రూ.80 మార్కు దాటి రూ.81.09కి చేరింది. అయితే.. హైదరాబాద్‌లో మాత్రం సీఎన్జీ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నెల ఆరంభంలో కిలోకు రూ.౯౭ పలికిన ధర, ఇప్పటికీ స్థిరంగానే ఉంది.

కేంద్రం సుంకాల తగ్గింపు, రాష్ట్రాలు మాత్రం ససేమిరా 

చమురు సంస్థల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ.10 చొప్పున తగ్గించింది. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్న సమయం లో సంస్థల నష్టాలను తగ్గించేందుకు ద్వారా సుంకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని వదులుకుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వ్యా ట్ లేదా సేల్స్ టాక్స్ తగ్గించుకునేందుకు సుముఖంగా లేవు. చమురు విక్రయాల ద్వా రా యేటా రాష్ట్రాలకు లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. అందుకే సుంకాలు తగ్గించుకునేందుకు రాష్ట్రాలు ముందుకు రావడం లేదు.

ఇంధన కొరతలేదు: ఐవోసీ

దేశంలో పెట్రోల్, డీజిల్ (ఇంధన) కొరత లేదని ప్రభుత్వ చమురు రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కొన్ని రిటైల్ అవుట్‌లెట్లలో ఇంధన కొరతకు స్థానిక అంశాలు, పంటకాలం, ఆందోళనలే కారణమని తెలిపింది. ప్రాంతీయంగా డిమాండ్ సరఫరా వ్యత్యాసం వల్లే సమస్య తలెత్తుతోందని, అది కూడా తాత్కాలికమేనని స్పష్టం చేసింది. అయినా తమ సర ఫరాలో ఎలాంటి ఆటంకాలు లేవని స్పష్టం చేసింది. ఇంధన డిమాండ్‌కు ఎన్నో కారణాలున్నాయని తెలిపింది. మే1 మధ్య పెట్రోల్ అమ్మకాలు 14 శాతం, డీజిల్ అమ్మకాలు 18 శాతం పెరిగాయని తెలిపింది.

42వేల రిటైల్ అవుట్‌లెట్లలో కొన్ని ప్రాంతాల్లోనే రద్దీ కనిపిస్తుందని తెలిపింది. మిగతా అన్ని అవుట్‌లెట్లలో ఇంధన  నిల్వ లు సరిపడా ఉన్నాయని తెలిపింది. ప్రజల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ఇతర ఆయిల్ మార్కెటింగ్ సంస్థల సహకారంతో దేశవ్యాప్తంగా ఇంధన నిల్వలను మరింతగా అందుబాటులో ఉంచామని ఇండియన్ ఆయిల్ ప్రకటించింది. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేసింది. దేశంలో ఇంధన లభ్యత పుష్కలంగా ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐవోసీ స్పష్టం చేసింది.