నిర్మల్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం
ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి
నిర్మల్, మార్చి ౫ (విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీ అభివృద్ధి సంపూర్ణ సహకారం ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ మున్సిపల్ చైర్ పర్సన్ అప్పాల కావ్య, వైస్ చేర్మెన్ గణేష్ చక్రవర్తి హైదరాబాద్‌లో సుదర్శన్ రెడ్డిని కలిసి సన్మానం చేశారు. గురువారం నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీహరి రావు, మాజీ మంత్రి వేణుగోపాల చారితో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి నిర్మల్ పట్టణ అభివృద్ధిపై చర్చించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులను సమన్వయం చేసి విజయవంతంగా ముందు కు తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ అభివృద్ధిలో తనవంతు సహకారం అందించాలని కోరారు. నిర్మల్ పట్టణ సమస్యల పరిష్కారానికి అత్యధిక నిధులు కేటా యించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలాన్నా రు. నిర్మల్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి సహకారంతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.




