13 July, 2026 | 1:19 AM

విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం

13-07-2026 12:21 AM

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కోరుట్ల(జగిత్యాల), జూలై 12 (విజయ క్రాంతి): రాష్ట్రంలో విద్యాభివృద్ధికి తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.  జగిత్యాల జిల్లా కేంద్రంలోని చలగల్ వాలంటరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మం త్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, ప్ర భుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కు మార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి స త్యంలతో కలిసి భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రీ య విద్యాలయం కోసం కేటాయించిన భూ మి గతంలో రైతులకు చెందినదని, భూమి కేటాయింపులో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నిరంతర కృషితో రాష్ట్ర ప్రభుత్వం వాలంటరీ వ్యవసాయ క్షేత్రంలోని ఐదు ఎకరాల భూమిని కేంద్రీయ విద్యాలయానికి కే టాయించిందన్నారు. విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, జగిత్యాల అభివృద్ధికి అవసరమైన ప్ర తి అంశంలో ప్రభుత్వం అండగా ఉంటుంద ని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్ దినేష్, జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, చలగల్ గ్రామ సర్పంచ్ జున్ను రాజేందర్, జగిత్యాల ఆర్.డి.ఓ. మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.