3 March, 2026 | 11:18 PM

ధర్మారం గ్రామ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయండి

03-03-2026 08:19 PM

మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని ధర్మారం గ్రామ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుదారి సర్వేష్ గౌడ్ వినతి పత్రంలో కోరారు. మంగళవారం హైదరాబాద్ లో మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి శ్రీధర్ బాబు ను కలిసిన సర్వేష్ మంత్రి తో  మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని గ్రామంలోని ధర్మారం (గద్దలపల్లి) నుండి జిల్లాలపల్లి గ్రామానికి రోడ్డు అభివృద్ధికి, అలాగే గద్దలపల్లి నుండి రామకృష్ణాపురం వరకు రోడ్ నిర్మాణం చేపట్టాలని కోరారు.

స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు గ్రామ అభివృద్ధికి తప్పకుండా నిధులు మంజూరు చేసి రోడ్లను గ్రామాన్ని అన్నిరంగలు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని సర్వీష్ గౌడ్ తెలిపారు. స్పందించిన మంత్రికి సర్వీష్ గౌడ్ గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.  ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు కొయ్యాల రాజమల్లు, కన్నూరి రవి, తోకల మల్లేష్  తదితరులు ఉన్నారు.