పటేల్ చెరువు మరమ్మతులకు రూ.42 లక్షలు నిధులు మంజూరు
నాగిరెడ్డిపేట్, జోన్ 28 (విజయ క్రాంతి): గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామ పటేల్ చెరువు కట్ట తెగిపోయినందున దాని మర్మంతుల కొరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు 42 లక్షల నిధులు మంజూరు చేయగా అట్టి పనులను ఆదివారం గ్రామ సర్పంచ్ మన్నె వెంకటి కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మన్నే వెంకట్ మాట్లాడుతూ... పటేల్ చెరువు కట్ట తెగిపోయినందున దాని మరమ్మతులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు 42 లక్షల నిధులు మంజూరు చేసినందుకు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడనున్న సందర్భంగా పనులు నాణ్యతతో చేపట్టి త్వరగా పూర్తి చేసి గ్రామస్తులకు వర్షాకాలంలో మళ్లీ సమస్యలు తలెత్తకుండా చూస్తానని తెలిపారు.
అలాగే పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని చిన్నారులకు సర్పంచ్ మన్నే వెంకట్ పోలియో చుక్కలు వేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మన్నే వెంకట్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమామ్, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ లక్ష్మణ్ ఠాగూర్,గ్రామ అధ్యక్షులు బోయిని హనుమాన్లు,మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మురళి గౌడ్,నాయకులు ఫారుక్,శ్రీరామ్ గౌడ్,దత్తు, శ్రీనివాస్ రెడ్డి,సాయ గౌడ్, శ్రీనివాస్ గౌడ్,షకీల్,ప్రవీణ్, రాజు,రమేష్,విజయ్,బాబు తదితరులు పాల్గొన్నారు.






