29 June, 2026 | 2:01 AM

ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

29-06-2026 12:00 AM

తాడ్వాయి, జూన్, 28( విజయ క్రాంతి ): గ్రామంలోని మాల కులస్తులకు ఇల్లు లేని ఇండ్ల స్థలాలు లేని వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ స్థానిక సర్పంచ్ కు బాధితులు వినతిపత్రం అందించారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలోని మాల కులస్తులు ఆదివారం స్థానిక సర్పంచ్, వార్డు సభ్యులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఇళ్ల స్థలాలు లేకపోవడంతో ఇల్లు నిర్మించుకోలేకపోతున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజలింగం, శ్రీహరి, రవీందర్,నరసయ్య,కృష్ణ శ్రీకాంత్ నాగేష్ లక్ష్మయ్య, రవితేజ తదితరులు పాల్గొన్నారు.