విద్యుత్ ప్రమాదంతో పాడి గేదె మృతి
మహమ్మదాబాద్, జూన్ 28 : మండల పరిధిలోని జూలపల్లి గ్రామంలో సంతాపురం నిరంజన్ రెడ్డి. తండ్రి కిష్టారెడ్డి.కి చెందిన పాడి గేదే మేతకు విడిసిన సమయంలో ప్రమాదవశాత్తు తన పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్ దగ్గర ఉన్న గడ్డి వేయడానికి వెళ్లి పాడి గేదె విద్యుత్ షాక్ మృతి చెందింది. గేదె విలువరు.
48 వేలు ఉంటుందని. పొద్దున్నుంచి కళ్ళ ముంగిటనే పాడి గేదే విద్య శాఖ్ తో మృతి చెందిందని పాడి రైతు నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ప్రత్యేకంగా కంచెలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో చోటుచేసుకుంటున్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో విద్యుత్ వినియోగదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






