ప్రజాసేవ కార్యక్రమాలు అభినందనీయం
మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ప్రజాసేవ కార్యక్రమాలు అభినందనీయమని పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పోచారం డివిజన్ లో శనివారం జనగామ శాసనసభ్యులు మాజీ రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు సేవ కార్యక్రమలలో కొండల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అన్నోజిగూడ శ్రీలక్ష్మీనరసింహస్వామి కాలనీలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో పేదలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో దాదాపు 808 మందికి పైగా వినియోగించుకున్నారు. అన్నోజిగూడ యాదాద్రి పార్కు లో వాలీబాల్ టోర్నమెంట్, వెంకటాపురం నీలిమ హాస్పిటల్ లో దాదాపు 100 మంది రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ, యంనంపేట శ్రీరంగనాయకస్వామి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం, సంసృతి టౌన్ షిప్ లోని అగపే అనాదాశ్రమంలో 200 మంది విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.






