11 July, 2026 | 7:48 PM

Breaking News

సర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి

11-07-2026 06:56 PM

మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు

సదాశివ నగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం పద్మాజివాడి, మూడేగాం, కల్వరాల్, గ్రామాలలో సర్ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ఓటరు జాబితాలో అర్హులైన వ్యక్తుల ఓట్లు పోకుండా చూడాలని మాజీ జెడ్పిటిసి పడిగేల రాజేశ్వరరావు పార్టీ నాయకులకు సూచించారు. శనివారం పద్మాజివాడిచౌరస్తాలో చాయ్ పై చర్చ చేస్తూ పై విధంగా సూచించారు.

సర్ కార్యక్రమం పట్ల ప్రజల్లో కొంత గందరగోళం ఏర్పడిందని స్వయంగా ఇండ్లలో తిరుగుతూ ఓటర్ల కు అవగాహన కల్పించడంతోపాటు ప్రారంభించడంలో సహకరించాలన్నారు. గ్రామాల్లో ఏ ఒక్కరు ఓటు తొలగించకుండా పార్టీ నాయకులు అందరూ 10 రోజుల పాటు కష్టపడాలని ఆయన సూచించారు. 

గ్రామాల్లో సర్ కార్యక్రమంలో ఏ ఒక్కరి ఓటు కోల్పోకుండా వార్డ్ లవారీగా పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు. ఈ చర్చలో మండల బారాస పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి నరసారెడ్డి, మూడేగామ గ్రామ బారాస అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా మైనార్టీ నాయకుడు దస్తగిరి, మండల ఎస్సీ సెల్ నాయకుడు నరసాపురం గంగారెడ్డి, అజ్గర్ రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.