1 July, 2026 | 2:52 PM

మల్కాపేట మున్నూరు కాపు సంఘ భవనానికి 5 లక్షల మంజూరు ప్రొసీడింగ్ అందజేత

01-07-2026 02:04 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం మల్కాపేట గ్రామంలోని మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రూ.5 లక్షల నిధులను మంజూరు చేయగా, వాటికి సంబంధించిన ప్రొసీడింగ్‌ను సంఘ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘ సభ్యులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామ సర్పంచ్, బోయిన దేవరాజు మాట్లాడుతూ... ఎమ్మెల్యే సహకారంతో మల్కాపేట గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇతర సంఘ భవనాలకు కూడా త్వరలోనే నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు.అభివృద్ధే తమ లక్ష్యమని, ప్రజలకు ఉపయోగపడే పనుల ద్వారా గ్రామ ప్రగతికి కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.