ఎన్నో ఏళ్ల కల వంతెన నిర్మాణం ఎట్టకేలకు సాధ్యం
ఎమ్మెల్యే మదన్మోహన్ కృషితో హై లెవెల్ వంతెన బ్రిడ్జి నిర్మాణం కు నిధులు మంజూరు
ఎల్లారెడ్డి జూన్ 4 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలంలోని ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారి మార్గమధ్యలో ఉన్న అడవి లింగాలు గేటు సమీపంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కు ఎమ్మెల్యే మదన్మోహన్ 4.50 లక్షల నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ కు క్షీరాభిషేకం చేసిన ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు. క్షీరాభిషేకం చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటరామిరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి మార్గ మధ్యలో వంతెన వర్షాకాలం వచ్చిందంటే ప్రమాదం అంచులో ఉండేదని ఎట్టకేలకు మొన్న కులసిన భారీ వర్షాలకు వంతెన ధ్వంసం కావడంతో ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రత్యేక చొరవ తీసుకొని వంతెన నిర్మాణం కొరకు 4. 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఎల్లారెడ్డి ప్రజలకు ఎంతో మేలు కలిగించారని వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సంజీవరెడ్డి నాగం గోపికృష్ణ ఆశమోల్ల సాయిబాబా అడవి లింగాల సర్పంచ్, నాగరాజు, జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






