18 March, 2026 | 6:56 PM

అభివృద్ధికి నిధులు కేటాయించాలి

19-07-2024 01:24 AM

స్పీకర్‌కు మున్సిపల్ చైర్‌పర్సన్ వినతి 

వికారాబాద్, జూలై 18 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా కేంద్రం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించేలా చొరవ చూపాలని కోరుతూ మున్సిపల్ చైర్‌పర్సన్ చిగుళ్లపల్లి మంజుల, రమేశ్ దంపతులు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరారు. గురువారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. వికారాబాద్ పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటికీ ఇన్నాళ్లు నిధుల లేమితో అభివృద్ధి జరగలేదని వివరించారు. కాంగ్రెస్ హయాంలోనైనా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వికారాబాద్ పట్టణ రూపురేఖలు మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పట్టణ అభివృద్ధికి ప్రణాళికలు కూడా సిద్ధం చేశామని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు.