1 September, 2026 | 1:52 AM

డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు కృషి చేస్తా: రేణుకా చౌదరి

31-08-2026 11:31 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు మాజీ కేంద్ర మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ని సోమవారం గ్రంధాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు ఆవశ్యకత, జిల్లాలోని విద్యార్థులు, నిరుద్యోగ యువతకు కలిగే ప్రయోజనాలను వివరించారు. డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, సంబంధిత డాక్యుమెంట్లను రేణుకా చౌదరి కి అందజేశారు.

దీనిపై స్పందించిన రేణుకా చౌదరి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యార్థులు, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, ఆధునిక సాంకేతిక సదుపాయాలు అందించాలనే తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంకల్పానికి డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు ఒక మంచి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో,నిరుద్యోగ యువతకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు,కృషి చేస్తున్నామని చైర్మన్ పసుపులేటి వీరబాబు తెలిపారు.