26 April, 2026 | 1:37 AM

మరింత పెరిగిన బంగారం ధర

15-02-2025 01:05 AM

* 10 గ్రాములు రూ.89,400

* లక్ష దాటేసిన కిలో వెండి

న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధర మళ్లీ పెరిగింది. ఒక్కరోజులోనే రూ.1300 పెరిగింది. దీంతోరాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం) పసిడి ధర రూ.89,400కు చేరింది.గురువారం 10 గ్రాముల పుత్తడి ధర రూ.88,100 వద్ద ఉంది. అటు వెండి సైతం కిలో మళ్లీ లక్ష రూపాయల మార్కు దాటింది.

గురువారం రూ.98 వేలుగా ఉన్న దీని ధర ఒక్కో రోజులోనే రూ.2 వేలు పెరిగి నాలుగు నెలల గరిష్ఠానికి చేరింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం సైతం రూ.1300 పెరిగి రూ.89 వేలకు చేరింది. అమెరికా దిగుమతులపై ఛార్జీలు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం ప్రపంచ వాణిజ్యాన్ని అనిశ్చితిలోకి నెట్టింది. 

అమెరికా నుంచి వస్తున్న ప్రకటనల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి బం గారం కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.