26 April, 2026 | 3:23 AM

మార్కెట్లకు కొనసాగిన నష్టాలు

15-02-2025 01:02 AM

* 23 వేల దిగువకు నిఫ్టీ

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. భారత్ సహా ఇతర దేశాలపై రెసీప్రోకల్ టారిఫ్‌ను విధిస్తాననే నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకోవడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.

ఓ దశలో దాదాపు 700 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ సైతం 22,774.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఆఖరులో రెండు బెంచ్ మార్క్ సూచీలు కోలుకున్నాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. సెన్సెక్స్ ఉదయం 76,388.99 పాయింట్ల వద్దలాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా ఒరవడి కొనసాగింది.