17 ఏళ్ల తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌కు లాభాలు
15-02-2025 01:07 AM
న్యూఢిల్లీ: ఎట్టకేలకు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ల్) లాభాల బాట పట్టింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ సంస్థ లాభాలు ఆర్జించడం విశేషం. మూడో త్రైమాసికంలో బీ ఎస్‌ఎన్‌ఎల్‌కు రూ. 262 కోట్లు లాభాలు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.
2007 తర్వా త ఈ ప్రభుత్వ టెలికాం సంస్థ లాభాలు ఆర్జించడం ఇదే మొదటిసారి. ఇటీవలి కాలంలో బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త కస్టమర్లను ఆకర్షించడంతో పాటుగా సేవల విషయంలో కూడా మెరుగైన ప్రదర్శన చూపిస్తున్న విషయం తెలిసిందే.






