29 June, 2026 | 3:20 AM

మున్సిపల్ కమిషనర్లుగా గజానంద్, రమేష్

25-06-2025 01:49 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్/బెల్లంపల్లి అర్బ న్ జూన్ 24 (విజయక్రాంతి): ఆసిఫాబాద్, బెల్లంపల్లి  మున్సిపల్ కమిషనర్లుగా గజానంద్, తన్నీరు రమేష్‌ను నియమిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తం గా 56 మంది మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న వారికి గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్ గా పదోన్నతులు కల్పిస్తూ పలు ప్రాంతాలకు బదిలీ చేశారు. అందులో భాగంగా గజానంద్‌ను ఆసిఫాబాద్‌కు కేటాయించారు.

బెల్లంపల్లి  మున్సిపాలిటీలో ఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్న  భుజంగరావు ఆసిఫాబాద్ ఇం చార్జ్ మున్సిపల్ కమిషనర్ ఇన్నాళ్లు కొనసాగారు. బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న  శ్రీనివాసరావు హెచ్‌డి ఎంఎకు బదిలీ అయ్యారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో మేనేజర్‌గా పనిచేస్తున్న రమేష్ ప్రమోషన్‌పై బెల్లంపల్లి కమిషనర్‌గా బదిలీ అయ్యారు.