calender_icon.png 4 November, 2025 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గజ్వేల్ దవాఖానలో సమస్యల తిష్ట

28-09-2024 12:02:14 AM

ప్రసూతి వార్డుల్లో బొద్దింకలు

పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం

ఇబ్బంది పడుతున్న రోగులు

గజ్వేల్, సెప్టెంబరు26: గతంలో పారిశుధ్య నిర్వహణ, ఆహ్లాదకరమైన వాతావ రణం ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిగా మూడుసార్లు అవార్డు పొందిన గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి ఇప్పుడు అపరిశుభ్రతకు నిలయంగా మారుతోంది. దవాఖానలో ప్రసూతివార్డులు, మరుగుదొడ్లు సరిగా శుభ్రం చేయకపోవడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది.

బాలింతల, చిన్నపిల్లల వార్డులు బొద్దింకలకు నిలయంగా మారా యి. రోగుల సహాయులో కోసం ఆసుపత్రి ఆవరణలో ఇదివరకు పచ్చనిచెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణ ఉండేది. అయితే ప్రస్తుతం ఆసుపత్రి ఆవరణలో ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో దోమల బెడద పెరిగిపోయింది. ఆసుపత్రిలో మెరుగైన పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.