16 March, 2026 | 3:35 PM

Breaking News

మంథని లైన్ గడ్డ, బొక్కల వాగు కట్టపై ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం   •   తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి కమిటీ   •   చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి   •   అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా శ్రీమంతాలు   •   రాష్ట్రం అప్పుల్లో ఉంది..పైసలు లేక ప్రాజెక్టులు ముందుకు పోతలే   •   యుద్ధాన్ని ఆపాలని సీపీఐ రాస్తారోకో   •   అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •  

రోడ్డేమో ఇలా.. ప్రయాణం ఎలా?

28-09-2024 12:01 AM

పటాన్‌చెరు-దౌల్తాబాద్ రహదారిపై గుంతలు

ఇబ్బంది పడుతున్న వాహనదారులు

పటాన్‌చెరు, సెప్టెంబర్ 26: ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని పటాన్‌చెరు-దౌల్తాబాద్ ప్రధాన రహదారి గోతులమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీఎంఆర్ ఫంక్షన్ హాల్ నుంచి ఇంద్రేశం మీదుగా దౌల్తాబాద్‌కు వెళ్లేందుకు ఈ రహదారి అత్యంత కీలకం.

నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఈ రహదారిపై ప్రయాణిస్తుంటారు. గత ప్రభుత్వ హయాంలో పటాన్‌చెరు నుంచి పెద్ద కంజర్ల వరకు రహదారి విస్తరణ, మరమ్మతుల కోసం హెచ్‌ఎండీఎ 22 కోట్ల రూ పాయలు కేటాయించి టెండర్లు పిలిచింది. సకాలంలో పనులు ప్రారంభం కాకపోవడం.. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం రావ డంతో నిధులలేమి పేరుతో కేటాయించిన నిదులను హెచ్‌ఎండీఎ రద్దు చేసింది.

ఇటీవల కురిసిన వర్షాలకు ఈ రోడ్డుపై గుంతలు పడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పజాప్రతినిధులు, అధికారులు స్పం దించి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈవిషయమై ఆర్‌అండ్‌బీ ఏఈ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా.. సంబంధిత రహదారి మరమ్మతుల కోసం ఇటీవల కలెక్టర్ వల్లూరి క్రాంతి రూ.5 లక్షలు కేటాయించారని.. ఇప్పటికే గుంతలను పూ డ్చేందుకు టెండర్లు ఆహ్వానించామని.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.