గాలికుంటు టీకా జిల్లా ప్రచార రథం ప్రారంభం
మున్సిపల్ చైర్మన్ యెర్నేని కుసుమ వెంకటరత్నం బాబు
కోదాడ, మార్చి 24 : కోదాడ పట్టణ ప్రాంతీయ పశువైద్యశాలలో గాలి కుంటు టీకా జిల్లా ప్రచార రథాన్ని మున్సిపల్ చైర్మన్ యెర్నేని కుసుమవెంకటరత్నం బాబు మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాలికుంటు టీకా పై జిల్లా ప్రజలకు అవగాహన నిమిత్తం ఊరూరా తిరిగడానికి ప్రచార రథం ఏర్పాటు చేయడం అత్యంత మంచి కార్యక్రమం అన్నారు.
కార్యక్రమంలో జిల్లా పశువైద్య , పశుసంవర్ధక అధికారి డా బోడేపూడి శ్రీనివాసరావు, జిల్లా గ్రంధాలయం చైర్మన్ వంగవీటి రామారావు వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లీశ్వరి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య, మున్సిపాలిటీ 6 వ వార్డు కౌన్సిలర్ నాగేంద్రమ్మ, ప్రముఖ లాయరు కె యల్ ఎన్ ప్రసాద్ , సిబ్బంది రాజు చంద్రకళ , కర్ణ, సాగర్, రాజేష్ పాల్గొన్నారు.




