25 March, 2026 | 2:34 AM

బీఆర్‌ఎస్వీ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం

25-03-2026 12:50 AM
  1. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు  విడుదల చేయాలని డిమాండ్
  2. జాబ్ క్యాలెండర్ ఏమైందంటూ నినాదాలు
  3. అసెంబ్లీ వైపు దూసుకెళ్లిన విద్యార్థి నేతలు 
  4. ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు
  5. రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్,  ఉపాధ్యక్షుడు తుంగబాలు అరెస్ట్

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో విద్యా రంగాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని నిరసిస్తూ మంగళవారం బీఆర్‌ఎస్వీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. విద్యా రంగ సమస్యలను పరిష్కరిం చాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ వైపు దూసు కెళ్లిన విద్యార్థి నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్య క్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షు డు తుంగ బాలు సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట, నాంపల్లి పోలీస్ స్టేషన్లకు తరలిం చారు. అరెస్ట్ అనంతరం గెల్లు శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘విద్యా కమిషన్  చైర్మన్ ఆకునూరి మురళి సిఫార్సులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి విలువ ఇవ్వడం లేదు. బడ్జెట్‌లో విద్యకు 18 శాతం నిధులు కేటాయించాలని కమిషన్ సూచిస్తే, ప్రభు త్వం కేవలం 8 శాతానికే పరిమితం చేసింది.

గత బడ్జెట్‌తో పోలి స్తే ఈసారి విద్యా రంగానికి దాదాపు రూ.3 వేల కోట్ల నిధులను తగ్గించారు. యంగ్ ఇం డియా స్కూల్స్ పేరుతో అంకెల గారడీ చేస్తూ సామాన్య విద్యార్థులను మోసం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. ఫీజు రీయిం బర్స్‌మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు ఉంటే, బడ్జెట్‌లో కేవలం రూ.4 వేల కోట్లు మాత్ర మే కేటాయించడం విద్యార్థులను, కళాశాల యాజమాన్యాలను వంచించడమేనని విమర్శించారు.

బకాయిలు విడుదల చేయకపో వడంతో కళాశా లలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమ యంలో ప్రియాంక గాంధీ సాక్షిగా ఇచ్చిన హామీలను రేవంత్‌రెడ్డి సర్కా ర్ తుంగలో తొక్కిందని ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలతో కూడి న జాబ్ క్యాలెండర్ అమలు ఎక్కడ అని నిలదీశారు. మహిళా విద్యార్థులకు స్కూటీలు, రూ. 5 లక్షల విద్యా నిధి రుణ పథకం వంటి హామీ ల ఊసే లేదని దుయ్యబట్టారు.

కెసిఆర్ హయాంలో ప్రారంభించిన స్కూల్ బ్రేక్ ఫాస్ట్, పాలు, జావా వంటి పథకాలను ఇప్పు డు కాంగ్రెస్ పథకాలుగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతే సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో పోరాటా న్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్‌ఎస్వీ నేతలు హెచ్చరించారు.

బీఆర్‌ఎస్వీ నేతల అరెస్టు దుర్మార్గం

  • బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, 2 లక్షల ఉద్యోగ నియామకాల హామీ ఏమైందని నిలదీసిన బీఆర్‌ఎస్వీ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంలోనైనా నిధులు విడుదల చేయాల్సింది పోయి, ప్రశ్నించిన గొంతుకలపై విరుచుకుపడటం ఎమర్జెన్సీని తలపిస్తోందని మండిపడ్డారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం విద్యార్థి నాయకులు అసెంబ్లీని ముట్టడించాల్సిన దుస్థితి తెచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలని మంగళవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నమ్మించి నిరుద్యోగులను నయవంచన చేశారని విమర్శించారు. జాబ్ క్యా లెండర్‌కు పాతరేసి, బీఆర్‌ఎస్ ప్రభుత్వం నింపిన ఉద్యోగాలను నిర్లజ్జగా కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు.

విద్యావ్యవస్థను కుప్పకూల్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేసిన పాపం విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రిదే ఆగ్రహం వ్యక్తంచేశారు. 127 మంది విద్యార్థులు గురుకులాల్లో మరణించినా ముఖ్యమంత్రిలో కనీసం చలనం లేదని, దీనిపై ఇప్పటివరకు స్పందించిన పాపాన పోలేదని విమర్శించారు.

తమ పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తంచేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం బకాయిపడ్డ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని సూచించారు. అక్రమంగా అరెస్టు చేసిన బీఆర్‌ఎస్వీ నేతలందరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌చేశారు.