గల్లిగల్లిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు
16-09-2026 | 12:05am
రాజపూర్: ఏటా భాద్రపదమాసంలో అత్యంత వైభవంగా జరుపుకునే వినాయక చవితి(Vinayaka Chavithi)ని మండల ప్రజలు సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మండల కేంద్రం తోపాటు మండలంలోని చొక్కామ్ పేట్, దొడ్లపల్లి తిరుమలపూర్ రాయపల్లి కల్లేపల్లి మల్లేపల్లి ఖానాపూర్ చెన్నవెళ్లి తదితర గ్రామాలలో ప్రజలు యువకులు గల్లి గల్లికి గణనాథుని ప్రతిష్ట చేసి భక్తి చేతలతో పూజలు నిర్వహించారు. గణపతికి ఇష్టమైన ప్రకృతిలో దొరికే పత్రాలు పూలు పండ్లు బలహారాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే గణపతి నవరాత్రి ఉత్సవాల్లో(Ganapati Navratri celebrations) ప్రతినిత్యం అన్నదానాలు భజనలతో గ్రామాలు ఇలాగే వినాయక చవితి పండుగను వేడుకలు జరుపుకొనున్నారు.