గణేష్ నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
శోభాయాత్ర ఏర్పాట్ల పరిశీలనలో సిపి సాయి చైతన్య
నిజామాబాద్ ఆగస్టు 31: (విజయ క్రాంతి): ఆర్మూర్ పట్టణంలో జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి పోలీసు శాఖ సమగ్ర ఏర్పాట్లు చేపడుతోంది. ఈ క్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, శోభాయాత్ర కొనసాగే ప్రధాన రూట్ను , రహదారి మరమ్మతు ల పనుల తో పాటు గుండ్ల చెరువు చెరువు వద్ద ఉన్న నిమజ్జన ఘాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు.
శోభాయాత్ర దారిలో కాంట్రాక్టర్లు చేపడుతున్న బారికేడింగ్ పనులు , రహదారి మరమ్మతు పనులు , పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు బారికేడ్లు సరిగా ఏర్పాటు కావాలని , వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు వెంటనే మరమ్మతు చేయాలని సంబంధిత అధికారులను సిపి సాయి చైతన్య ఆదేశించారు.
శోభాయాత్రలో భారీగా జనసమ్మర్థం ఏర్పడే ప్రాంతాల్లో ట్రాఫిక్ను సమర్ధవంతంగా నియంత్రించేలా ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ను కఠినంగా అమలు చేయాలని , పలు కీలక జంక్షన్ల వద్ద ప్రత్యేక బృందాలను మోహరించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ నిమజ్జన ఘాట్ వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.
కాబట్టి అక్కడ పటిష్టమైన బారికేడ్లు , లైటింగ్ , డ్రౌన్ ప్రూఫ్ జాకెట్లు , రక్షణ బృందాలు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆర్మూర్ ఏసీపి జె. వెంకటేశ్వర్ రెడ్డి , ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ , మున్సిపల్ సిబ్బంది శ్రీ చందు మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శాంతి కమిటీ సమావేశం
బాన్సువాడ ఆగస్టు 31 (విజయ క్రాంతి): గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకో వాలని బాన్సువాడ పట్టణ సిఐ యం. అశోక్ అన్నారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో సిఐ అశోక్ మాట్లాడుతూ ఈ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందో బస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు.
మండపాల వద్ద ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే తక్షణమే స్పందించడానికి, పోలీస్, మున్సిపల్, విద్యుత్ మరియు ఇతర శాఖల అధికారుల నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు భక్తుల రద్దీని నియంత్రించడానికి మహిళల భద్రత కోసం తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.
అలాగే, పోలీసులు తెలిపిన సూచనలను మండపంలో ప్రముఖంగా కనిపించేలా ప్రదర్శిం చాలన్నారు. ఫేక్ వార్తలను లేదా విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులను సామాజిక మాధ్యమాల్లో ప్రచా రం చేయవద్దని, అలాంటి సమాచారం ఏదై నా ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని సూచించారు.భక్తి పాటలను మాత్రమే ప్లే చేయాలని, డీజేల వాడకం పూర్తిగా నిషేధం అని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ ఇప్పటికే పంపించిన లింక్లో మండప వివరాలు, విగ్రహం ఎత్తు, నిమజ్జనం చేయదలచిన తేదీ ప్రాంత వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ వివరాల ఆధారంగానే ట్రాఫిక్ నియంత్రణ బందోబస్తు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.






