6 May, 2026 | 8:56 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

దొంగల ముఠా పట్టివేత

16-09-2025 12:05 AM

మహదేవపూర్, సెప్టెంబర్ 15 (విజయ క్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవి ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు వ్యక్తుల దొంగల ముఠాను పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సోమవారం విలేకరుల సమావేశంలో కాటారం డిఎస్పి సూర్యనారా యణ వెల్లడించారు.

సూర్యనారాయణ కథనం ప్రకారం అడవి ముత్తారం మండలంలో వరసగా  దొంగతనాలు జరుగుతున్నవి అనే ఉద్దేశంతో అడవి ముత్తారం ఎస్త్స్ర మహేందర్ కుమార్ ఆధ్వ ర్యంలో బృందం ఏర్పడి రాత్రి పూట గస్తి నిర్వహిస్తుండగా ఉదయం మూడు గంటల సమయం లో ఒక ఆటోలో నలుగురు వ్యక్తులు అనుమాన స్పదంగా సంచరిస్తూ యామన్ పల్లి గ్రామ సమీపంలో ఉన్నారు.

వారిని పట్టుకుని లోతుగా విచారించగా ఇట్టి నలుగురు వ్యక్తులు గత సంవత్సర కాలంగా ఒక మూఠగా ఏర్పడి వారి గ్రామానికి చుట్టుపక్కల ఉన్న మండలాల్లో మారుమూల గ్రామాల్లో ఆటోలో తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తూ రాత్రి పూట వెళ్లి దొంగతనాలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు.

ఈ ముఠా వివరాలు 1)చిగురు సంతోష్ కాటారం మండలం దేవరాంపల్లి.2) బుర్రకుంట ప్రకాష్, 3) జైనేని రమేష్, 4) షేక్ కుదరత్  వీళ్ళు నలు గురు ముఠాగా ఏర్పడి కాటారం మండలంలోని మూడు ట్రాన్స్ఫార్మర్ల ను, కొయ్యూరు మం డలంలోని రెండు ట్రాన్స్ఫార్మర్ల ను, పలిమెల మండలంలో ఒక ట్రాన్స్ఫార్మర్ అడవి ముత్తారం మండలంలో ఒక ట్రాన్స్ఫార్మర్, మొత్తం 7 ట్రాన్స్ఫార్మర్ లను పగులగొట్టి కాపర్ (రాగి) వైరు దొంగిలించారు.

అడవి ముత్తారం మండల కేంద్రంలో రోడ్డుపై ఉన్న ఎడ్ల బండి గీరాలను, ట్రాక్టర్ బ్యాటరీని, మంథిని మండలం ఆరేంద వద్ద ఒక పవర్ టిల్లర్ ను దొంగలించారు. వీరి నుండి కొంత కాపర్ వైర్ ను, పవర్ టిల్లర్ ను, ట్రాక్టర్ బ్యాటరీని, ఎడ్ల బండి గిరాలను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

ఈ దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అడవి ముత్తారం ఎస్త్స్ర మహేందర్ కుమార్ ను సిబ్బందిని కాటారం డిఎస్పి ప్రత్యేకంగా అభినందించారు.  కాటారం సిఐ నాగార్జున రావు, సిబ్బంది పాల్గొన్నారు.