7 May, 2026 | 6:14 PM

జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ.. ఖరీదైన చీరలెత్తుకెళ్లిన మహిళా దొంగలు

11-03-2025 12:12 PM

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన చీరల చోరీ

12 లక్షల విలువైన చీరలు దొంగతనం చేసిన మహిళల ముఠా

హైదరాబాద్: నగరం నడిబోడ్డున భారీ దొంగతనం జరిగింది. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్(Jubilee Hills) లో చోటుచేసుకుంది. ఓ మహిళల ముఠా రూ. 12 లక్షల విలువైన చీరలను దొంగతనం చేసిది. ధార్ కేఫ్ అండ్ బిస్ట్రో(Dhar Cafe and Bistro)లో ఈనెల 8న వస్త్ర ప్రదర్శనలలో చోరీ జరిగినట్లు గుర్తించారు. చీరల దొంగతనం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు(Jubilee Hills Police) దర్యాప్తు చేస్తున్నారు.