02-12-2025 11:03:51 PM
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను ఎక్సైజ్ సిబ్బంది మంగళవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నానక్రాంగూడలో గంజాయి డాన్ నీతుబాయి నివాసంలో గంజాయి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది సోదాలు నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 786 గ్రాముల గంజాయి, 110 బీరు, బ్రిజర్, ఒక బైక్, రూ. 60,890 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఎస్టిఎఫ్ బి టిం లీడర్ ప్రదీప్రావు, సిఐ బిక్షారెడ్డి, ఎస్త్స్ర బాలరాజు, సిబ్బంది దాడి నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న గోవింద్, దుర్గెష్, నీతుబాయి కుమారుడు దుర్గ ప్రసాద్ను అరెస్టు చేశారు. ఒడిసా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిపారు. కేసు దర్యాప్తు కోసం నిందితులను, గంజాయి, నగదును శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లోఅప్పగించారు.