2 May, 2026 | 9:23 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

ఉరివేసుకుని గృహిణి ఆత్మహత్య

03-12-2025 12:00 AM

కల్వకుర్తి, డిసెంబర్ 2: కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్లో మాధవి (33) అనే గృహిణి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. విద్యానగర్ లో భర్త గౌతమ్ ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. సోమవారం సాయంత్రం భార్యాభర్తల మధ్య గొడవ కావడంతో క్షణికావేశంతో బెడ్ రూమ్ లోకి వెళ్లి చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది.

కొంత సమయం అయ్యాక భర్త పిల్లలు గమనించి మాధవిని ఎంత పిలిచినా బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి గదిలోకి వెళ్లారు. అప్పటికే ఫ్యానుకు ఉరివేసుకొని కనిపించడంతో వెళ్లి తీసేసరికి మృతి చెందింది. 

సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని  మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల  ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త గౌతం నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు బాలికలు, కుమారుడు ఉన్నారు.