calender_icon.png 3 December, 2025 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులకు ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలి

03-12-2025 12:00:00 AM

రాజాపూర్, డిసెంబర్ 2 : ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ విషయంలో గోప్యత పాటించాలని కోరుతూ పిఆర్‌టియు మండలశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉపాధ్యాయులు ఎంపీడీవో విజయలక్ష్మి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగులకు ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ ని ఉపాధ్యాయులకు ఇస్తూ దాంతోపాటు స్వస్తిక్ గుర్తు ఇవ్వాలని కోరారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారికి  ఎలక్షన్ విధుల నుంచి మినహాయింపు నివ్వాలని కోరారు.

పిఆర్టియు టిఎస్  అధ్యక్షులు లాల్కోట ఉదయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి  ఏపీ మోజెస్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎం తిమ్మారెడ్డి, ఎల్లయ్య, రమాదేవి, అజీజ్ విజయభాస్కర్, శివప్రసాద్, సరోజ, సంయుక్త రాణి, మాధవి, లత, సరళ, సంజీవరెడ్డి, మాధవిలత, భాస్కర్, మురళీకృష్ణ రామకృష్ణ పాల్గొన్నారు.