13 July, 2026 | 9:52 PM

Breaking News

33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •  

హబీబ్ నగర్‌లో పోలీసులపై దాడి

13-11-2024 10:37 AM

హైదరాబాద్: గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేయడానికి వెళ్లిన పోలీసులపై దాడి జరిగిన సంఘటన నగరంలోని హబీబ్ నగర్ పరిధిలో చోటుచేసుకుంది. గంజాయి విక్రయం సమాచారంతో వెళ్లిన పోలీసులకు ఊహించని షాక్ తగిలింది. అర్ధరాత్రి పోలీసులపై మాంగర్ బస్తీ వాసులు దాడి చేశారు. గంజాయి అమ్ముతున్నారన్న పక్క సమాచారంతో  ఎస్ఐ శివకూమార్, స్థానిక పోలీసులతో కలిసి షాదీఖానా బస్తీకి వెళ్లారు. పోలీసులను చూసి గంజాయి వ్యాపారి కంబ్లీ దీపక్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో గంజాయి వ్యాపారి కంబ్లీ దీపక్ ను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. కంబ్లీ దీపక్ సోదరుడు అరుణ్, బస్తీ వాసులు పోలీసులపై దాడికి దిగారు. బీరు సీసాలతో దాడిలో ఎస్ఐ శివకుమార్ తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం కంబ్లీ దీపక్, అరుణ్ పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న కంబ్లీని తప్పకుండా పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.