విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలను సోమవారం బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. విద్యార్థినిల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లోని వసతులు భోజనశాల మరుగుదొడ్లు తరగతి గదులు వసతి గృహ గదులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థినీలకు అనేక వసతులు కల్పిస్తుందని పాఠశాలలో విద్యార్థి నీళ్ల పట్ల అశ్రద్ధ వహించకుండా ప్రభుత్వం అందించే మెనూ ప్రకారం భోజనం కనీస సౌకర్యాలు వసతులు అన్నీ కల్పించాలని లేనియెడల కఠిన చర్యలు తప్పవని ఎంపీడీవో ఆనంద్ అధికారానికి హెచ్చరించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు విద్యార్థి నీల పర్యవేక్షణ పాఠశాలలోనే బస చేయడం చేయాలని ఆయన సూచించారు. ఆయన వెంట సోషల్ వెల్ఫేర్ ఆఫిసర్ అర్చన పాల్గొన్నారు.






