లక్ష విలువ చేసే గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్
21-06-2024 06:36 PM
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకోని ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.65 లక్షల విలువైన 228 కిలోల గంజాయితో పాటు విదేశీ ద్రవ్యం స్వాధీనం చేసుకున్నారు. దీని ఒడిశా నుంచి చెన్నైకి గంజాయిని తరలిస్తున్నట్లు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పేర్కొన్నారు.






