13 May, 2026 | 3:29 AM

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ

21-06-2024 05:15 PM

న్యాల్ కల్: సంగారెడ్డి జిల్లాలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. న్యాల్ కల్ తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ వ్యక్తి దగ్గర ఆర్ఐ దుర్గయ్య రూ.75 వేలు లంచం తీసకుంటూ ఏసీబీకి చిక్కారు. ఆర్ఐ దుర్గయ్యను అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.