17 July, 2026 | 9:09 PM

Breaking News

మైనార్టీ గురుకుల ఉద్యోగులపై జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ. రూ.5.62 లక్షల ఫైన్   •   రోగుల సేవలకు మరింత బలం   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ నైపుణ్యాలతో ఉపాధి పెరుగుతుంది   •   సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •  

మహిళల రక్షణే ధ్యేయం

21-06-2024 10:03 PM

హైదరాబాద్: బాలికలు, మహిళల రక్షణ కల్పించడమే తమ ధ్యేయమని, వారిని వేధించే పోకిరీలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ డా. తరుణ్‌ జోషి హెచ్చరించారు. పోకిరీలపై మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. శుక్రవారం ఎల్‌బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలోని రాచకొండ ఉమెన్స్ సేఫ్టీ వింగ్, షీటీమ్స్ ఆధ్వర్యంలో 111 మంది ఈవ్‌టీజర్లకు వారి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ నెల 1 నుంచి 15 వరకు ఫోన్ ద్వారా 26, సోషల్‌మీడియా ద్వారా 34, నేరుగా 95 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా 9 క్రిమినల్ కేసులు, 57పెట్టి కేసులు నమోదు చేశామని, 54 మందికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. 

మహిళలు ఫిర్యాదు చేయాల్సిన నంబర్లు

మహిళలు వేధింపులకు గురైనప్పుడు వెంటనే షీటీమ్స్ లేదా రాచకొండ సీపీ కార్యాలయానికి 8712662111 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. భువనగిరికి చెందిన వారు 8712662598, చౌటుప్పల్ 8712662599, ఇబ్రహీంపట్నం 8712662600, కుషాయిగూడ 8712662601, ఎల్‌బీ నగర్ 8712662602, మల్కాజ్‌గిరి 8712662603, వనస్థలిపురం 8712662604 నంబర్లకు సంప్రదించాలని కోరారు.