27 June, 2026 | 7:43 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

చెత్త డంపింగ్‌తో ప్రజారోగ్య సంక్షోభం

09-02-2026 01:02 AM

సనత్‌నగర్, ఫిబ్రవరి 7 (విజయ క్రాంతి):- దాసారం బస్తి, సి టైప్ క్వార్టర్స్, రవీందర్ నగర్ కాలనీ, బాలయ్య నగర్, బాలయ్య నగర్ వెస్ట్ పరిసర రెసిడెన్షియల్ కాలనీల్లో తీవ్ర ప్రజారోగ్యం, భద్రతా సమస్యలు నెలకొన్నాయని స్థానికులు ఆరోపించారు. ఈ సమస్యలపై ఆదివారం దాసారం బస్తి వాసు లు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాల నుంచి సేకరించిన చెత్తను తమ ప్రాంతానికి తరలించి, చెత్త తో నిండిన వాహనాలను గంటల తరబడి, కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి ఇక్కడే నిలిపివేస్తున్నారని వారు తెలిపారు.

చెత్తలో కుళ్లిపోయిన వ్యర్థాలు, మృత జంతువులు కూడా ఉండటంతో భరించలేని దుర్వాసన వ్యాపిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం దోమలు, ఈగలు, ఎలుకలు, వీధి కుక్కల పెంపకం కేంద్రంగా మారిందని, డెం గ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు, టైఫాయిడ్, చర్మవ్యాధులు, శ్వాసకోశ సమస్యలు వ్యాపించే ప్రమాదం పెరిగిందని హెచ్చరించారు. ఈ సమావేశంలో దాసారం బస్తి అ ధ్యక్షుడు పోతురాజు కుమార్, విక్రమ్ పం తులు, ఎస్. ఉషారాజ్, పి. రాజ నర్సింగ్, బాలయ్య నగర్ వెస్ట్ అధ్యక్షుడు సిహెచ్. సుధీర్ కుమార్, జనరల్ సెక్రటరీ పి. శ్రీనివాస్, రవీందర్ నగర్ అధ్యక్షుడు విజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నా రు. సమస్యలకు తక్షణ పరిష్కారం చూపకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.