14 June, 2026 | 3:01 AM

జీడీపీ వృద్ధి 7.7%

14-06-2026 01:17 AM
  1. భారత ఆర్థిక వ్యవస్థ రికార్డుల జోరు
  2. గత ఆర్థిక సంసవత్సరంలో తయారీ రంగంలో ఘన విజయాలు
  3. డిజిటల్ పేమెంట్స్‌లో ప్రపంచలోనే ౫వ స్థానంలో భారత్
  4. కాస్త తగ్గిన జీఎస్టీ వసూళ్లు .. విదేశీ మారక నిల్వల్లోనూ తగ్గుదల
  5. ‘బ్రిక్‌వర్క్స్’ జూన్ నివేదికలో ఆసక్తికర అంశాలు

న్యూఢిల్లీ, జూన్ ౧౩: గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన వృ ద్ధిని నమోదు చేసింది. జీడీపీ వృద్ధి రేటు 7.7 శాతానికి చేరింది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ తన స్థానాన్ని మరిం త పటిష్టం చేసుకున్నది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతం ఉండగా, 0.౬ పెరగడం విశేషం. ప్రముఖ రేటింగ్స్ సం స్థ బ్రిక్‌వర్క్స్ తన జూన్ నివేదికలో మరెన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

అంతర్జాతీయంగా అనేక సవాళ్లు ఉన్నప్పటికీ భార త తయారీ రంగం 10.7 శాతం వృద్ధితో ఒక సంచలనం. డిజిటల్ పేమెంట్స్‌లో భారత్ ప్రపంచంలోనే ౫ స్థానాన్ని కైవసం చేసుకున్నది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, పెరుగు తున్న ఇంధన ధరల వల్ల రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరగవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించినప్పటికీ, ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా సజావుగా ముందుకు వెళ్లడం విశేషం. భారత వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 3.48 శాతానికి పెరిగింది. ఆహార ద్రవ్యోల్బ ణం 4.2 శాతానికి చేరడమే అందుకు ప్రధా న కారణం. దేశీయ తయారీ రంగ పీఎంఐ మే నెలలో 55.0 శాతానికి పెరిగింది.

కొత్త ఆర ర్లు రావడం వల్ల ఉత్పాదకత పెరిగింది. సేవల రంగ పీఎంఐ కూడా ఆరు నెలల గరి ష్ట స్థాయి అయిన 59.8 శాతానికి చేరింది. రవాణా, డిజిటల్ సొల్యూషన్స్, ఈ-కామర్స్, వినోద రంగాల నుంచి వచ్చిన బలమైన డి మాండ్ ఇందుకు దోహదం చేసింది. రాను న్న కాలంలోనూ దేశీయ వినియోగం బలం గా ఉంటుందని పరిశ్రమలు భావిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో దేశ మొత్తం ఎగుమతులు 80.80 బిలియన్ డాలర్లకు పెరిగాయి.

మధ్యప్రాచ్య సంక్షోభం వల్ల ఆ ప్రాంతానికి ఎగుమతులు తగ్గినప్పటికీ, కొత్త మార్కెట్లను అన్వేషించడం ద్వారా భారత్ ఈ నష్టాన్ని అధిగమించింది. టాంజానియా, శ్రీలంక, సింగపూర్, బంగ్లాదేశ్, వియత్నాం దేశాలకు ఎగుమతులు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో దేశ మొత్తం దిగుమతులు 88.61 బిలియన్ డాలర్లకు చేరాయి. దీనితో మొత్తం వాణిజ్య లోటు 7.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయి లో 2.42 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైన జీఎస్టీ వసూళ్లు మే నెలలో 1.94 లక్షల కోట్ల రూపాయలకు తగ్గాయి.

దిగుమతుల నుంచి వచ్చే ఆదాయం 19.1 శాతం పెరిగింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లో వసూళ్లు తగ్గు ముఖం పట్టాయి. మే నెలలో దేశ విదేశీ మా రక నిల్వలు 681 బిలియన్ డాలర్లకు తగ్గా యి. విదేశీ కరెన్సీ ఆస్తులు, బంగారు నిల్వలు తగ్గడం ఇందుకు కారణం. రూపాయి విలువ క్షీణించకుండా స్థిరంగా ఉంచడం కోసం రిజర్వ్ బ్యాంక్ డాలర్లను విక్రయించింది.

పశ్చిమ ఆసియా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గత వడు నెలల్లో భారత విదేశీ మారక నిల్వలు దాదాపు 47 బిలియన్ డాలర్లు తగ్గాయి. నూతన బేస్ ఇయర్ ఆధారంగా ఏప్రిల్ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) 4.9 శాతం వద్ధిని నమోదు చేసింది. పారిశ్రామిక రంగ వద్ధిని స్పష్టంగా అంచనా వేయడానికి బేస్ ఇయర్‌ను 2022-23 కు మార్చారు. తయారీ రంగం 6.2 శాతం వద్ధి సాధించింది. కొత్తగా చేర్చిన వ్యర్థాల నిర్వహణ, గ్యాస్ సరఫరా రంగాలు కూడా మంచి వద్ధిని కనబరిచాయి. మే నెలలో బ్యాంక్ క్రెడిట్ వద్ధి 16.2 శాతంతో బలంగా కొనసాగింది. డిపాజిట్ల వద్ధి 12.2 శాతంగా నమోదైంది.