29 July, 2026 | 5:01 PM

జలసిరి పథకాన్ని గ్రామాల్లో అమలు చేసే బాధ్యత సర్పంచులదే..

29-07-2026 04:30 PM

డిఆర్డిఓపిడి రాథోడ్ రవీందర్

ఉట్నూర్,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలతో పాటు  రైతుల పంట చేనులో  వర్షపు నీటిని భూగర్భ జలాల్లోకి పంపించేందుకు  ఇంకుడు గుంతలు, పొలం కుంట  లను ప్రతి ఒక్కరూ నిర్మించుకునే విధంగా సర్పంచులు ప్రజలకు అవగాహన కల్పించాలని డిఆర్డిఓ పిడి రాథోడ్ రవీందర్  రాథోడ్ రవీందర్ అన్నారు. బుధవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల  ప్రజా పరిషత్  కార్యాలయంలో సర్పంచులు, ఆయా శాఖ అధికారులతో  ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్పంచుల నుండి  గ్రామాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచనలు చేశారు. అనంతరం ఆయా శాఖ అధికారులు తమ శాఖ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను సర్పంచులకు వివరించారు.

ఈ సమావేశం సమావేశంలో  సర్పంచులు జాదవ్ లకన్, విట్టల్, జాదవ్ జమున నాయక్  తదితరులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ పథకం ఇళ్లను నిర్మించుకుంటే బిల్లులు చెల్లింపులో  ఎల్ త్రీ  గా చూపించడంతో బిల్లులు రాక  లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు అన్నారు. పలువురు సర్పంచులు మాట్లాడుతూ... మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదని  సమావేశంలో  ఆర్డబ్ల్యూఎస్ అధికారులను  నిలదీశారు. ఈ సమావేశంలో  డిఆర్డిఓ పిడి మాట్లాడుతూ... జలసిరి  పథకాన్ని  ప్రతి సర్పంచ్  సద్వినియోగం చేసుకోవాలన్నారు.  ఈ సమావేశంలో ఎంపీడీవో మహేందర్, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.