29 July, 2026 | 5:01 PM

ఇంగ్లాండ్‌లో గ్లోబల్ ఎంబీఏ పూర్తి చేసిన వంశీకృష్ణ

29-07-2026 04:27 PM

* యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్‌మౌత్‌లో గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ అందుకున్న గడ్డిపల్లి యువకుడు

గరిడేపల్లి,(విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని గడ్డిపల్లి గ్రామానికి చెందిన కొలిపాక వంశీకృష్ణ ఇంగ్లాండ్‌లోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్‌మౌత్లో గ్లోబల్ ఎంబీఏ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. బుధవారం నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఆయన గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా గడ్డిపల్లి గ్రామ ప్రజలు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థి విదేశాల్లో ఉన్నత విద్యను విజయవంతంగా పూర్తి చేయడం గర్వకారణమని పేర్కొన్నారు.

వంశీకృష్ణ సాధించిన ఈ విజయం మండల యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. కృషి, పట్టుదల ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని వారు అన్నారు. ఈ సందర్భంగా పలువురు వంశీకృష్ణను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ, పోర్ట్స్‌మౌత్ నగరం శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్న సంవత్సరంలో తాను అదే నగరంలోని యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన విజయానికి ఎల్లప్పుడూ అండగా నిలిచిన తల్లి అరుణకు, అలాగే తనకు సహకరించిన మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.