3 August, 2026 | 5:34 PM

Breaking News

కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ కొసం దరఖాస్తులు ఆహ్వానం   •   అథ్లెటిక్స్‌లో ఐపీఎస్ విద్యార్థుల సత్తా..   •   జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి. నాగేశ్వరరావు ఎన్నిక   •   గాజులరామారంలో రెవెన్యూ అధికారుల భారీ కూల్చివేతలు   •   స్పందన జూనియర్, న్యూ అరబిందో డిగ్రీ కళాశాలల్లో ఘనంగా బోనాలు గోరింటాకు పండగ   •   మిషన్ భగీరథలో కాంట్రాక్టర్ల దోపిడీపై ప్రజావాణిలో వినతి   •   తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లైబ్రరీకి పోటీ పరీక్షల పుస్తకాల విరాళం   •   ఇసుక మేటలు తొలగింపు   •   నిర్భయంగా పోలీస్ సేవలు వినియోగించుకోవాలి   •   నవ లిమిటెడ్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో దంత వైద్య శిభిరం   •  

తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

26-02-2026 12:00 AM

కడ్తల్ మండలంలో విషాదం

కడ్తల్ (చరికొండ), ఫిబ్రవరి 25: వృత్తిరీత్యా కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కిన ఓ గీత కార్మికుడు ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడటంతో తీవ్రంగా గాయపడిన ఘటన కడ్తల్ మండల పరిధిలోని చరికొండ గ్రామ శివారులో చోటుచేసుకుంది.

ఘటన వివరాల్లోకి వెళ్తే.. చరికొండ గ్రామానికి చెందిన ముత్యాలు గౌడ్ అనే గీతా కార్మికుడు ప్రతిరోజులాగే తన జీవనోపాధి కోసం తాటి వనానికి వెళ్లారు. చెట్టుపై కల్లు గీస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాలు జారడంతో నేరుగా కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన కాలు విరగడంతో పాటు శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో స్పందించిన తోటి గీతా కార్మికులు ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బాధితుడిని వైద్య చికిత్స నిమిత్తం సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు.

అయితే, గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బాధితుడిని అత్యవసరంగా హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ మహేందర్ గౌడ్ ఆసుపత్రికి చేరుకుని బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ‘ఎవరూ అధైర్యపడకండి అని తాను కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం‘ అని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన సాయం అందేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. గీత వృత్తిపై ఆధారపడి జీవించే కార్మికులకు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం నుండి తక్షణ ఆర్థిక సాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.