26 February, 2026 | 2:37 PM

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం

26-02-2026 12:00 AM

ఘట్ కేసర్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్ పరిధి ఎదులాబాద్ డివిజన్ అవుశాపూర్ లోని శ్రీ చైతన్య, అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో అధికారులు ఇంటర్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరిగాయి.

మొదటిరోజు విద్యార్థులను వారి తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాల వద్దకు తీసుకురావడం  కనిపించింది. పరీక్ష కేంద్రాలకు వద్దకు విద్యార్థులు గంట ముందే చేరుకోని హాల్ టికెట్ల ను చూసుకున్నారు. సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి కేంద్రాల్లోకి పంపించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి వాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండ పోలీసులు 144 సెక్షన్ ను అమలు చేశారు.

అవుశాపూర్ లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంకు బోర్డు లేకపోవడంతో విద్యార్థులు సెంటర్ చూసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. సెంటర్ సిబ్బందితో గొడవకు దిగారు. పోలీసులు కలుగజేసుకోని పరీక్ష కేంద్రం బోర్డును ఏర్పాటు చేయడంతో సమస్య సద్దుమనిగింది. సీఐ బాలస్వామి శ్రీచైతన్య కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంను పరిశీలించారు.

మేడ్చల్.. 2099 మంది విద్యార్థులు గైర్హాజరు

మేడ్చల్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మొదటిరోజు సెకండ్ ల్యాంగ్వేజ్ ఇంటర్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు జిల్లా మొత్తంగా 70268 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండాగా, 68169 మంది విద్యార్థులు హాజరయ్యారని, 2099 మంది విద్యార్థులు గైరుహాజరైనారని తెలిపారు. ఏలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా మొత్తంగా పరీక్ష ప్రశాంతంగా జరిగిందని వివరించారు.