ఉప్పల్ బిల్డర్స్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం
నిర్మాణరంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ
మేడిపల్లి,(విజయక్రాంతి): ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం మేడిపల్లిలోని తులిప్స్ గ్రాండ్ హోటల్‌లో ఘనంగా జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు ఆకుల సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సి. ప్రభాకర్ రావు, ముఖ్య సలహాదారు, మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షుడు జేపీ విద్యాసాగర్ ముఖ్య అతిథులుగా హాజరై నిర్మాణ రంగానికి సంబంధించిన పలు అంశాలపై విలువైన సూచనలు చేశారు.
ప్రస్తుతం నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా సెంట్రింగ్, మేస్త్రి కార్మికుల సమ్మె ప్రభావం, టీజీఎస్పీడీసీఎల్ శాఖ నుంచి బిల్డర్లకు ఎదురవుతున్న వివిధ ఇబ్బందులు, అలాగే ఇటీవల ప్రభుత్వం పట్టా భూములు, రిజిస్టర్డ్ ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చిన అంశాలపై సభ్యులు తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు. ఈ సందర్భంగా బిల్డర్స్ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా వ్యవహరించిన శ్రీ టిఎంటి ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.






